VijayTrisha: వచ్చి రాగానే త్రిష కోసం విజయ్ కీలక నిర్ణయం.. ‘కరుప్పు’ స్పెషల్ షోలకు పర్మిషన్

VijayTrisha: వచ్చి రాగానే త్రిష కోసం విజయ్ కీలక నిర్ణయం.. ‘కరుప్పు’ స్పెషల్ షోలకు పర్మిషన్

తమిళ స్టార్ హీరో సూర్య నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ (Karuppu). రేపు మే 14న చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందే చిత్రబృందం ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉదయం 9 గంటలకే ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో తమిళనాడు సీఎం విజయ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సీఎం కార్యాలయంలో విజయ్ ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “మే 14న ఉదయం 9 గంటల షోలకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారికి ధన్యవాదాలు” అని పేర్కొంది.

త్రిష కోసం విజయ్ కీలక నిర్ణయం!

ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. గత కొన్ని నెలలుగా తమిళనాట త్రిష పేరు ఫుల్ స్వింగ్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్తో త్రిష రిలేషన్లో ఉన్నట్లు పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ఇద్దరు కలిసి పెళ్ళికి అటెండ్ అవ్వడం నుంచి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి వెళ్లడం వరకు అన్నీ ఆసక్తికరంగా మారాయి. 

ఇటీవలే విజయ్ కోసం తిరుపతిలో మొక్కులు చెల్లించుకోవడం, ఆపై విజయ్ ఇంటికి వెళ్లడం, అలాగే విజయ్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవ్వడం వంటి విషయాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే త్రిష నటించిన ‘కరుప్పు’ సినిమాకు ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ రావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ పర్మిషన్ పూర్తిగా ఆడియన్స్ డిమాండ్ దృష్ట్యా ఇచ్చినదిగా చిత్రబృందం వెల్లడించింది. ఏదేమైనా, త్రిష నుంచి సినిమా వస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్లో ఆసక్తిపెరిగింది.

‘కరుప్పు’ స్టోరీ..

ఇప్పటికే విడుదలైన ‘కరుప్పు’ (వీర భద్రుడు) ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మంచి ఎమోషనల్ కోర్ట్‌‌రూమ్ డ్రామాగా సాగుతుందని సమాచారం. ముఖ్యంగా మన భారత న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా సినిమా తెరకెక్కింది. ఈ మేరకు ఫస్టాఫ్ సినిమాకు కీలకంగా మారనుంది. అలాగే, సెకండ్ హాఫ్ కూడా ఏ మాత్రం డోస్ తగ్గకుండా పూర్తి స్థాయి మాస్ మసాలా మూమెంట్స్‌‌తో ఉండనుంది. ఈ క్రమంలోనే కంగువ, రెట్రో వంటి డిజాస్టర్స్ తర్వాత సూర్యకు ‘కరుప్పు’తో భారీ హిట్ దక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ‘వీరభద్రుడిగా’ రిలీజ్ చేస్తోంది.

సాయి అభ్యంకర్ మ్యూజిక్..

సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని టాక్. సూర్య-త్రిష కెమిస్ట్రీ, ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిసిన ‘వీరభద్రుడు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్‌, నట్టి, స్వసిక, అనఘ, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.