సమంత మోహంలో నవ్వు చూడాలని ఉంది.. విజయ్ ఎమోషనల్ కామెంట్స్

సమంత మోహంలో నవ్వు చూడాలని ఉంది.. విజయ్ ఎమోషనల్ కామెంట్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టారు మేకర్స్.ఇందులో భాగంగా మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, సమంత, చిత్ర నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ఆడియన్స్ ను అలరించారు. 

ఆ సంధర్బంగా విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మేము ఈ సినిమా చేసాం. సెప్టెంబర్ 1న ప్రేక్షకులు ఖచ్చితంగా నవ్వుతూనే థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఈ సినిమాకు సమంత మెయిన్. ఆమె లేకపోతే ఖుషీ లేదు. షూటింగ్ మధ్యలో కొంతకాలం సామ్ హెల్త్ బాలేదు. చూడడానికి అందంగా ఉంది, స్క్రీన్ పై కూడా అందంగా కనిపిస్తోంది. అలాంటి అమ్మాయికి హెల్త్ బాలేకపోవడం ఏంటి అనుకున్నాం కానీ..  సడెన్ గా ఒకరోజు అసలు విషయం తెలిసింది. మూడు రోజుల్లో సెట్ అవుతుంది అనుకున్నాం కానీ.. అది ఎంత సీరియస్ అనేది సమంత చెప్పిన తరువాతే మాకు తెల్సింది. చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తిచేసింది సమంత. అందుకే ఈ సినిమాతో సమంత ముఖంలో నవ్వు చూడాలని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు విజయ్. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.