ట్రైలర్ టైమ్ ఆగయా.. జులై 26న ‘కింగ్డమ్’ ట్రైలర్ రిలీజ్

ట్రైలర్ టైమ్ ఆగయా.. జులై 26న ‘కింగ్డమ్’ ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్డమ్’.   సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జులై 31న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జులై 26న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం అనౌన్స్ చేశారు. తిరుపతిలో ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నట్టు  తెలియజేశారు. 

ఈ సందర్భంగా విజయ్‌‌కు వీర తిలకం దిద్దిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది టీమ్.  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. అన్నదమ్ముల అనుబంధం బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.