బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో బలమైన ముంబైతో కర్నాటక తలపడనుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్‌లాంటి కీలక ప్లేయర్లపై దృష్టి నెలకొంది. గ్రూప్ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన కర్నాటక.. ముంబైతో జరిగే మ్యాచ్‌లో తమ అత్యుత్తమ ఆటతీరును చూపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కర్నాటక స్టార్ బ్యాటర్ దేవదత్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో సహా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 640 రన్స్‌తో టోర్నీ టాపర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లిస్ట్–ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక సౌరాష్ట్రతో జరిగే రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో అజేయంగా నిలవడమే ఇందుకు కారణం. నాలుగు గ్రూప్‌ల్లో ఈ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక జట్టు యూపీ. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సౌరాష్ట్ర తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బ్యాటర్లతో పాటు పేసర్ చేతన్ సకారియా మంచి ఫామ్‌లో ఉండటం సౌరాష్ట్రకు కలిసొచ్చే అంశం.
