నేనున్నా.. అన్ని రకాలుగా ఆదుకుంటా: కరూర్‌‌‌‌ బాధితులతో రిసార్ట్‎లో విజయ్సమావేశం

నేనున్నా.. అన్ని రకాలుగా ఆదుకుంటా: కరూర్‌‌‌‌ బాధితులతో రిసార్ట్‎లో విజయ్సమావేశం

చెన్నై: తమిళనాడులోని కరూర్‌‌‌‌లో జరిగిన తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్‌‌ పరామర్శించారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌‌లో బాధితులను కలిశారు. మొత్తం 37 కుటుంబాలకు రిసార్ట్‌‌లో 50 రూమ్‌‌లను ఆ పార్టీ బుక్‌‌ చేసింది. అక్కడే వారికి లంచ్‌‌ కూడా ఏర్పాటు చేసింది. 

ఒక్కో ఫ్యామిలీని విజయ్‌‌ వ్యక్తిగతంగా కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాల్లోని పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తానని విజయ్‌‌ హామీ ఇచ్చారు. కాగా, అంతకుముందు కరూర్‌‌‌‌ బాధిత కుటుంబాలను 5 బస్సుల్లో మహబలిపురంలోని రీసార్ట్‌‌కు పార్టీ నేతలు తరలించారు.