
- భోపాల్ సేవాభారతి కార్యదర్శి
పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషంట్ సహాయకులకు జనహిత షెల్డర్ హోమ్ అందిస్తున్న సేవలను అభినందనీయమని మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వచ్చిన సేవా భారతి సంస్థ జాతీయ కార్యనిర్వహాక కార్యదర్శి విజయ్ పురానిక్ అన్నారు.
తెలంగాణ కార్య నిర్వాహక కార్యదర్శి వాసుతో కలసి ఆయన మంగళవారం గాంధీ దవాఖానలో జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షెల్డర్ హోమ్ ను సందర్శించారు. దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం అల్ఫాహారం, రెండు పూటలా భోజనం సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు.