విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ‘ఇంజి వెల్లం’ అనే డిఫరెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తెలుగులో దీనికి అల్లం నీరు అని అర్థం.
కోల్‌కతా నేపథ్యంలో ఈ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నిర్మిస్తోంది. కథా బలమున్న సినిమాలకు ప్రాధాన్యతను ఇచ్చే సాయిపల్లవి, విజయ్ సేతుపతి కలిసి నటిస్తుండటం, మణిరత్నం తీస్తున్న లవ్ స్టోరీ కావడంతో అంచనాలు నెలకొన్నాయి.
