
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(vijay Sethupathi) మరో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. అది కూడా ముఖ్యమంత్రిగా. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్య(Siddi ramayya) జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సిద్దు రామయ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఫైనల్ చేశారట మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఒక సామాన్యుడిలా మొదలైన సిద్దిరామయ్య జీవితం.. ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎలా సాగింది. ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాల నేపధ్యంలో ఈ సినిమా రానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సిద్దిరామయ్య జీవితంలో జరిగిన ఒక బ్రేకప్ లవ్ స్టోరీని కూడా ప్రస్తావించనున్నారట.
త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాకు లీడర్ రామయ్య(Leader ramayya) అనే పేరును ఖరారుచేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక ఈ సినిమా కన్నడ తోపాటు తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం.