
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న కోలుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఇవాళ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన... తారకరత్న గుండె, కాలేయంతో పాటు ఇతర అవయవాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మెదడులో కొంత భాగం దెబ్బతిందని..దానికి సంబంధించిన చికిత్స జరుగుతోందన్నారు. తారకరత్న చికిత్సకు సంబంధించి అన్ని విషయాలను బాలకృష్ణ చూసుకుంటున్నారని చెప్పారు. బాలకృష్ణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.