
సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. అసలు ఏది అక్రమమో… సక్రమమో చెప్పలేని పరిస్థితి ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్న కెసిఆర్ ప్రభుత్వం… ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ భవనం అని తెలిసినా… దానిని కూలుస్తామనడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా? అని అన్నారు విజయశాంతి.
ఆగస్టు 15 నుంచి అసలైన పాలన మొదలవుతుందని కేసీఆర్ ప్రకటించారంటే.. ఇంతకాలం తెలంగాణ పాలన జరగలేదన్న విషయాన్ని కేసీఆరే ఒప్పుకున్నట్లు స్పష్టమైందన్నారు. అధికారంలో ఉన్నాం కదా ? అని ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్ భావించడం దురదృష్టకరమన్నారు. మూడేళ్లలో అధ్బుతం జరుగుతుందని కేసీఆర్ అంటున్నారు.. మూడేళ్ల తర్వాత తెలంగాణలో అధ్బుతం జరుగుతుందని బీజేపీ వాళ్లు అంటున్నారు.. ఇంతకీ ఎవరి మాట నిజమో అర్థం కావడం లేదన్నారు.