తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచినోళ్ల మధ్య ఉండలేక వచ్చేశా : విజయశాంతి

తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచినోళ్ల మధ్య ఉండలేక వచ్చేశా : విజయశాంతి

తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్విట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆమె ట్విట్ పై సొంత పార్టీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయంశంగా మారింది. తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చారని వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయశాంతి. అనాడు తెలంగాణను వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఉన్నచోట ఉండటం ఇష్టం లేక ముందుగానే వచ్చేశానని ట్విట్టర్ లో పేర్కొన్నారు విజయశాంతి. 

విజయశాంతి రియాక్షన్.. ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ బీజేపీలోకి ఉద్యమాన్ని అణిచివేసిన వారు.. తెలంగాణ వ్యతిరేకులు ఎవరూ అంటూ చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ ను తొలగించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి విజయశాంతి కొంచెం ముభావంగానే ఉంటున్నారు. దీనికితోడు కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి హాజరైన కొంత మంది చివరి వరకు ఉండకుండానే.. మధ్యలోనే వెనుదిరిగారు. వీరిలో విజయశాంతి ఉన్నారు. ఈ క్రమంలోనే మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఆమె ఉద్దేశించి అన్నది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డినే అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది.. ఉద్యమం సమయంలో సీఎంగా ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డినే కదా.. అని కామెంట్స్ చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తర్వాతే తాను వచ్చానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.