తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ దీక్షా చేయలేదు

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ దీక్షా చేయలేదు

హైదరాబాద్, వెలుగు : చావు నోట్లో తలపెట్టిన.. కోమాలోకి పోయిన అంటూ సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకీ రాముడి కథలేనని బీజేపీ నేత విజయశాంతి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూస్​లు తాగితే.. విద్యార్థులు, ఉద్యమకారులు తిరగబడ్డ విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. తన నిరాహారదీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ  దీక్షా చేయలేదన్నారు. నిమ్స్​లో దొంగ దీక్ష, ఢిల్లీలో దీక్ష పేరుతో గోల్ మాల్ కథలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని కామెంట్ చేశారు. 2009లో దీక్ష చేపట్టి 2014దాకా కూసుంటే రాష్ట్రం వచ్చిందా అని ఆమె ఎద్దేవా చేశారు.