ఎన్నికల్లో పోటీకి దూరంగా విజయశాంతి.. బీజేపీ లిస్టులో కనిపించని పేరు

ఎన్నికల్లో పోటీకి దూరంగా విజయశాంతి.. బీజేపీ లిస్టులో కనిపించని పేరు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు   నామినేషన్లు ప్రక్రియ ముగిసింది.  నవంబర్ 10 లాస్డ్ రోజు కావడంతో బీజేపీ ఇవాళ 14 మంది అభ్యర్థులతో ఫైనల్ లిస్టును రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్టులో బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి గత కొన్ని రోజులుగా బీజేపీపై అసంతృప్తిగా ఉంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా పాల్గొనడం లేదు. 2014లో విజయశాంతి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతారనుకున్నారంతా. కానీ లిస్టులో ఆమె పేరు లేదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె నిరాకరించారా? లేక పార్టీనే తప్పించిందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి.  ఇటీవల ఆమె రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. 

మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు

 మేములవాడ. వనపర్తి, చాంద్రాయణ గుట్ట అభ్యర్థులను మార్చింది. గతంలో వనపర్తి స్థానాన్ని  అశ్వత్థామ రెడ్డికి కేటాయించగా.. ఆయన ప్లేసులో  అనుజ్ఞారెడ్డికి కేటాయించింది. చాంద్రాయణ గుట్ట నుంచి సత్యనారాయణకు బదులుగా ఆ టికెట్ ను మహేందర్ కు కేటాయించింది. వేముల వాడ టికెట్ ను తుల ఉమకు గతంలో కేటాయించిన బీజేపీ  ఆ స్థానానికి అభ్యర్థిని మార్చింది. అక్కడి నుంచి వికాస్ రావు బరిలో నిలువనున్నారు.  శేర్లింగంపల్లి టికెట్ ను కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన రవికుమార్  యాదవ్ కు కేటాయించారు. రవికుమార్ టికెట్ విషయంలో కొండా అధినాయకత్వంపై  తెచ్చిన ఒత్తిడి ఫలించింది.