తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరిగానే TVK పార్టీ పోటీ.. సీఎం అభ్యర్థిగా విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరిగానే TVK పార్టీ పోటీ.. సీఎం అభ్యర్థిగా విజయ్

గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్​ కు తెరపడింది. టీవీకే పార్టీ పొత్తు పెట్టుకుంటుందా.. లేదా ఒంటరిగానేపోటీ చేస్తుందా.. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు.. ఇలా రాజకీయ ఊహాగానాలకు చెక్​ పడింది. 2026 తమిళనాడు  అసెంబ్లీ  ఎన్నికల్లో స్వతంత్రంగా నే పోటీ చేయాలని తమిళిగ వెట్రి కజగం(TVK) డిసైడ్​ అయింది.. ఇదే విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు , సినీ నటుడు విజయ్​ బుధవారం (నవంబర్​5) మామల్లపురం లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. 

ఇక సీఎం అభ్యర్థిపై ఉన్న ఉత్కంఠకు కూడా తెరపడింది.. తమిళిగ వెట్రి కజగం పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్​ను ఎన్నుకుంది ఆ పార్టీ కార్యవర్గం. మామల్లపురంలో ని ఓ హోటల్​ లో జరిగిన సమావేశంలో విజయ్​ ని సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఆ పార్టీ కేడర్​.విజయ్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 2వేల మంది టీవీకే పార్టీ జనరల్ కౌన్సిల్​సభ్యులు, పార్టీ జిల్లా కార్యదర్శులు, ఆఫీస్​ బేరర్లు హాజరయ్యారు.  సెప్టెంబర్27న కరూర్​ లో విజయ్​ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట మృతులకు జ్ణాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు పార్టీ నేతలు. 

తొక్కిసలాట ఘటనలో టీవీకే పార్టీ యాక్టివిటీస్​ కొంతకాలం ఆగిపోయాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పార్టీ మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.  

మరోవైపు ఈ సమావేశలంలో జనరల్ కౌన్సిల్​ 12 తీర్మానాలను ఆమోదించింది. రాబోయే ఎన్నికలకు రాజకీయ, విధాన పరమైన స్వరాన్ని నిర్ణయించేందుకు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టింది పార్టీ. 

తమిళనాడులో స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​(SIR) ను నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతూ కీకల తీర్మానం చేసింది టీవీకే పార్టీ. ఈ ప్రక్రియ అర్హత కలిగిన ఓటర్లను తొలగించే అవకాశం ఉందని  ఆరోపించింది. 

ఓటర్ల జాబితాల యొక్క కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఒక ముఖ్యమైన తీర్మానం ఉంది, ఈ ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన ఓటర్లను తొలగించగలదని ఆరోపించింది.
శ్రీలకం నావికా దళం మత్య్సకారులను పదే పదే అరెస్ట్ చేస్తున్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం వారి ప్రయోజనాలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని టీవీకో ఆరోపించింది. 
తమిళనాడులో శాంతి భద్రతలు కరువయ్యాయి. కోయంబత్తూరు కాలేజీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసుతో రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంతో ఎంకే స్టాలిన్​ ప్రభుత్వం విఫలమైందని రుజువైందని టీవీకే తెలిపింది. 
డెల్టా రైతుల కష్టాలపై టీవీకే కౌన్సిల్​ ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం సేకరణలో జాప్యం, భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.