టెక్ యుగంలో ఇంకా ఇలాంటోళ్లున్నారా..చేతబడి అనుమానంతో వ్యక్తి దారుణహత్య

టెక్ యుగంలో ఇంకా ఇలాంటోళ్లున్నారా..చేతబడి అనుమానంతో వ్యక్తి దారుణహత్య

తాండూర్, వెలుగు : చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన వికారాబాద్‌‌ జిల్లా తాండూర్‌‌ మండలంలోని కరణ్‌‌కోట గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై వినోద్‌‌ రాథోడ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బాలు, సాయిలు (40) ఫ్రెండ్స్‌‌. బాలు టైలర్‌‌గా పనిచేస్తుండగా, సాయిలు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. 

బాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా..ఇందుకు సాయిలు చేతబడి చేయడమే కారణమని కొందరు గ్రామస్తులు చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన బాలు సాయిలును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా సోమవారం కరణ్‌‌కోట వద్ద ఉన్న సాయిలుపై బాలు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సాయిలు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.