300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై పోలీసులు, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సోమవారం దాడి చేశారు. ఈ రైడ్ లో దాదాపు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాణాపూర్ తండా కు చెందిన మహేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.