కోల్‌కతా: సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్‌లో జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ క్రీడా శాఖ మంత్రి పదవికి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సీఎం మమతా బెనర్జీకి తన రాజీనామా లేఖను పంపగా.. ఆమె అంగీకరించారు. అరూప్ బిశ్వాస్ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
కాగా, కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మమత సర్కారు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ కమిటీ సూచనల మేరకు డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హాకు షోకాజ్ నోటీసులు
జారీ చేసింది. ఘటనలో లోపాలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
