ఊదరగొట్టి ఉసూరుమనిపించింది: కేంద్ర బడ్జెట్పై పెదవి విరిచిన విపక్షాలు

ఊదరగొట్టి ఉసూరుమనిపించింది: కేంద్ర బడ్జెట్పై పెదవి విరిచిన విపక్షాలు

కేంద్ర బడ్జెట్ 2026-27 పై విపక్షాలు పెదవి విరిచాయి. బడ్జెట్ ఊదరగొట్టి ఉసూరుమనించారని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 01) ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదని పెదవి విరిచాయి. 

ఎంతో అంచనాలు పెంచారు తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు. 90 నిమిషాల స్పీచ్ లో ముఖ్యమైన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ కు కేటాయింపుల విషయంలో బడ్జెట్ ఫెయిలైందని అన్నారు. కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని.. ఇది పేలవమైన బడ్జెట్ అంటూ విమర్శించారు. 

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బడ్జెట్ పై ఆశలు లేనట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వంపై ఆశలు లేనప్పుడు బడ్జెట్ పై ఎందుకుంటుందంటూ ప్రశ్నించారు. ఈ బడ్జెట్ తో సామాన్యులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని అన్నారు.

5 శాతం మంది కోసమే ఈ బడ్జెట్: అఖిలేష్ యాదవ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం 5 శాతం మందిని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని.. బడ్జెట్ అలాంటి కేటాయింపులు ఎక్కడా కనిపించలేదని అన్నారు.