రాజన్న సిరిసిల్ల: రోడ్డు భద్రత అందరి భాద్యత అని రాజన్నసిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో విద్యార్థులతో కలిసి ఆర్టీఏ ఆఫీసర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓవర్ స్పీడ్, డ్రింక్ చేసి వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్నారు. ర్యాలీలో ఆర్టీవో లక్ష్మణ్, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ కృష్ణ పాల్గొన్నారు.
