కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ( ఫిబ్రవరి 1) బడ్జెట్-2026 లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 2026లో విదేశీ మార్కెట్ ఒత్తిడిని తట్టుకుంటూనే, దేశీయంగా వస్తువుల ధరలు తగ్గించేలా దిగుమతి సుంకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బడ్జెట్ 2026 తరువాత ధరలు తగ్గేవి
*క్యాన్సర్ రోగుల కోసం 17 రకాల మందుల ధరలు తగ్గనున్నాయి. అలాగే మరో 7 రకాల తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులు విదేశాల నుండి దిగుమతి ఇకపై చౌకగా అవుతుంది.
*ఇళ్లలో వాడే మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గనున్నాయి.
*టీవీ గ్లాస్ ఉత్పత్తులు, ఆప్టికల్ గ్లాస్ ధరలు తగ్గుతాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలో వాడే లిథియం బ్యాటరీలు చౌకగా లభిస్తాయి.
*ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే CNG ధరలు కూడా దిగిరానున్నాయి.
* విదేశీ టెక్నాలజీతో తయారయ్యే బూట్ల ధరలు తగ్గుతాయి.
*మత్స్య రంగం: సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతి సులభం చేయడం వల్ల చేపలు, రొయ్యల చెరువుల రైతులకు లాభం కలుగుతుంది.
*దేశీయంగా విమానాలు, రక్షణ పరికరాల తయారీకి వాడే విడిభాగాలపై పన్నులు తగ్గించారు. దీనివల్ల 'మేక్ ఇన్ ఇండియా' బలపడుతుంది.
*సెమీకండక్టర్లు: సెల్‌ఫోన్ చిప్స్ వంటివి తయారు చేసే ఖర్చు తగ్గుతుంది.
*విదేశాల నుండి తెప్పించుకునే వస్తువులపై పన్నును 10 శాతానికి తగ్గించారు.
*బట్టలు, తోలు వస్తువుల తయారీకి వాడే ముడిపదార్థాలపై పన్ను మినహాయింపును మరో ఏడాది పొడిగించారు.
బడ్జెట్ తరువాత ఖరీదైనవి
*ఖనిజాలు: పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఖనిజాలపై పన్నులు లేదా సుంకాల మార్పుల వల్ల వాటి ధరలు పెరగవచ్చు. దీని ప్రభావం వాటితో తయారయ్యే వస్తువులపై పడే అవకాశం ఉంది.
*స్క్రాప్: పాత ఇనుము లేదా ఇతర లోహాల తుక్కు (స్క్రాప్) ధరలు పెరగనున్నాయి. దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
*మద్యం: ఎక్సైజ్ సుంకం లేదా ఇతర పన్నుల పెంపు కారణంగా మద్యం ధరలు మరింత ఖరీదైనవి కానున్నాయి.
*ఫ్యూచర్స్ ట్రేడింగ్ : స్టాక్ మార్కెట్ లేదా కమోడిటీ మార్కెట్‌లో చేసే 'ఫ్యూచర్స్ ట్రేడింగ్'పై లావాదేవీల చార్జెస్ లేదా పన్నులు పెరగడం వల్ల ఇన్వెస్టర్లకు భారంగా మారనుంది.
