లొంగిపో.. లేకుంటే నీకూ మీ అన్న గతే

లొంగిపో.. లేకుంటే నీకూ మీ అన్న గతే

వికాస్ దూబే సోదరుడికి తల్లి వార్నింగ్

లక్నో : ‘పోలీసులకు లొంగిపోతే ప్రాణాలతో ఉంటవ్.. లేకుంటే మీ అన్నలాగే నువ్వు, నీకుటుంబమూ చనిపోతరు’ అంటూ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే తల్లి సరళా దేవి తన రెండో కొడుకుకు సూచించింది. ఈ నెల 3న బిక్రూ విలేజ్లో ఎనిమిది మంది పోలీసుల హత్య కేసులో దుబేతో పాటు ఆయన సోదరుడు దీప్ ప్రకాశ్ కూడా నిందితుడు. పోలీసుల హత్యాకాండ తర్వాత దుబేతో పాటు దీప్ ప్రకాశ్,ఇతర అనుచరులు పరారయ్యారు. మధ్య ప్రదేశ్ లో పోలీసులకు చిక్కిన వికాస్ దుబే..కాన్పూర్ కు తీసుకొస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ఇప్పటికీ పరారీలోనే ఉన్నదీప్ ప్రకాశ్ను పోలీసులకు లొంగిపొమ్మంటూ సరళాదేవి బుధవారం హెచ్చరించారు.