ఇస్రో ఘనత వెనక విక్రమ్​: ప్రధాని మోడీ 

ఇస్రో ఘనత వెనక విక్రమ్​: ప్రధాని మోడీ 
  • సారాభాయ్​ శత జయంతి వేడుకల సందర్భంగా మోడీ
  • నివాళులు అర్పిస్తూ వీడియో సందేశం
  • అహ్మదాబాద్​లో వేడుకలు

అహ్మదాబాద్: ‘స్పేస్, న్యూక్లియర్​ టెక్నాలజీలో ప్రపంచ దేశాలు అబ్బురపడే ప్రగతి సాధించడం వెనక డాక్టర్​విక్రమ్​ సారాభాయ్​ వేసిన పునాదే కారణం. ఆయన విజన్​వల్లే నేడు ఇస్రో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. 1960లో తుంబ కేంద్రం నుంచి సారాభాయ్​ ప్రయోగించిన రాకెట్ మూలాలతోనే ఇస్రో విజయవంతంగా దూసుకెళుతోంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. డాక్టర్​ విక్రమ్​ సారాభాయ్​ శత జయంతి వేడుకల సందర్భంగా నివాళులు అర్పిస్తూ మోడీ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. అహ్మదాబాద్​లో జరిగిన సారాభాయ్​ వేడుకల్లో నిర్వాహకులు ఈ వీడియోను ప్రదర్శించారు. ఏడాది పాటు జరగనున్న వేడుకలను ఇస్రో డిపార్ట్​మెంట్​ఆఫ్​ స్పేస్, డిపార్ట్​మెంట్​ఆఫ్​ అటామిక్​ఎనర్జీ సంయుక్తంగా సోమవారం ప్రారంభించాయి. అంతరిక్ష పితామహుడిగా పేరొందిన సారాబాయికి చంద్రుడిపై రోవర్​ల్యాండ్​ చేయడం ద్వారా 130 కోట్ల భారతీయుల తరఫున ఘన నివాళి అర్పించనున్నట్లు  ప్రధాని చెప్పారు. ఫేమస్ సైంటిస్ట్​ హోమీ బాబా మరణంతో ఏర్పడిన లోటును సారాభాయ్​ పూడ్చారని ప్రధాని కొనియాడారు. స్పేస్, న్యూక్లియర్​ టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం ఆయన విజన్​ వల్లే సాధ్యమైందన్నారు. సొసైటీలోని సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీ వాడటానికి వెనకాడొద్దని ప్రజలను ఆయన కోరారని చెప్పారు. కార్యక్రమంలో ఇస్రో చైర్మన్​శివన్, మాజీ చైర్మన్ ​కె.కస్తూరిరంగన్, సారాభాయ్​ కొడుకు కార్తికేయ సారాభాయ్​ పాల్గొన్నారు.