విజిలెన్స్ డీజీగా విక్రమ్‌‌ సింగ్ మాన్‌‌

విజిలెన్స్ డీజీగా విక్రమ్‌‌ సింగ్ మాన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: విజిలెన్స్‌‌  అండ్‌‌  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌  విభాగం డైరెక్టర్‌‌ జనరల్‌‌గా విక్రమ్‌‌  సింగ్‌‌  మాన్‌‌  నియమితులయ్యారు.  ప్రస్తుతం విజిలెన్స్‌‌  డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస రెడ్డి (1994) ఈ నెల 31న రిటైర్​ అవనున్నారు. ఆయన స్థానంలో హైదరాబాద్  సిటీ అడిషనల్  సీపీ (లా అండ్ ఆర్డర్) గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ సింగ్‌‌ మాన్‌‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్‌‌  రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.