
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ 61తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకు తంగలాన్ టైటిల్ ఖరారు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో గ్లింప్స్ ను పంచుకున్నారు.
వీడియో గ్లింప్స్ ను చూస్తే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో తంగలాన్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో విక్రమ్ గిరిజన తెగకు చెందిన యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 2014లో పా రంజిత్ సినిమా కథను విక్రమ్ కు వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఈ ఏడాది జులై 15 నుంచి షూటింగ్ ప్రారంభించినట్లు నిర్మాణ జ్ఞానవేల్ రాజా ఇటీవలే ప్రకటించారు.