
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తన నియోజకవర్గంలో నిరసన తగిలింది. టీడీపీ నాయకుడి కూతరు పెళ్లికి వెళ్లిన బాలకృష్ణను లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరికి రోడ్డు సరిగా లేదని వెంటనే రోడ్డును వేయించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామానికి రోడ్డు చేయడానికి చందాలు ఇవ్వాలంటూ బాలకృష్ణ ముందు జోలె పట్టుకుని అడుక్కుని నిరసన తెలిపారు.