గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

 నారాయణపేట, వెలుగు :   గ్రామ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా తిర్మలాపూర్ గ్రామంలోని తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకున్న ఆమె, ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కామన్ వర్క్ షెడ్‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, నాయకులు పగడాకుల శ్రీనివాస్, లక్ష్మి, జీఆర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామయ్య పాల్గొన్నారు.