
ఢిల్లీ : పంచాయతీ ఎన్నికల తర్వాత కశ్మీర్ లో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. టాక్స్ వసూలు, సోషల్ ఆడిట్ ద్వారా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. మంగళవారం ఢిల్లీలోని వెంకయ్యనాయుడు నివాసంలో కశ్మీర్ కు చెందిన సర్పంచ్ లు ఆయనను కలిశారు. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు.