విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా

న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ లో భారత రాయభారిగా ఉన్న ఆయనను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హర్షవర్ధన్ శుంగ్లా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వినయో క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. 1989 ఐఏఎఫ్ బ్యాచ్ కు చెందిన వినయ్ క్వాత్రా... గతంలో వాషింగ్టన్, బీజింగ్ లోని భారత దౌత్య కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. ఫ్రాన్స్ లో భారత రాయబారిగా కూడా ఆయన పని చేశారు. తన 32 ఏళ్ల సర్వీస్ లో ప్రధాని కార్యాలయంలో రెండేళ్లపాటు సంయుక్త కార్యదర్శిగాను పని చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పాలసీ ప్లానింగ్, రీసెర్చ్ డివిజన్ కు సారధ్యం వహించారు. 

మరిన్ని వార్తల కోసం...

రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్కు భయమెందుకు..?

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే