రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్కు భయమెందుకు..?

రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్కు భయమెందుకు..?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓయూకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్కు భయమెందుకని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ పర్యటన కోసం జగ్గారెడ్డి యూనివర్సిటీ వీసీని అనుమతి కోరారని చెప్పారు. ఆదివారం జగ్గారెడ్డి ఓయూకు వస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఓయూకు రాకుండా అడ్డుకున్నారంటే కేసీఆర్ మనస్తత్వం ఏంటో తెలంగాణ సమాజం గ్రహించాలని అన్నారు. 

టీఆర్ఎస్ నేతల విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు. బానిసలు మాట్లాడే మాటలపై తాను స్పందించనని చెప్పారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం వారిని చెప్పులతో కొట్టాలని అన్నారు. రబ్బరు చెప్పులు లేనోడు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారా అని రేవంత్ మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్