2023 ఎన్నికల ఏడాది: వినోద్ కుమార్ 

2023 ఎన్నికల ఏడాది: వినోద్ కుమార్ 

బీజేపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాషాయ పార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ అభివృద్ధిపై గొప్పగా చెప్పుకుంటారని... కానీ రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మాత్రం ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు కేటాయించిందో బీజేపీ నేతలు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికల కోసం ప్రధాని మోడీ రూ.1.35 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సెస్ ను కాపాడుకున్నామని వినోద్ కుమార్ చెప్పారు. 2023 ఎన్నికల ఏడాది అయినందున ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్న వినోద్.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం, నిరాశ, నిస్పృహతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో చేరేందుకు ఆంధ్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, నుండి ఎంపీలు, ఎమ్మేల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని చెప్పారు.