కుక్క పిల్లకు మందు తాగించిన యువకులు.. వీడియో వైరల్

కుక్క పిల్లకు మందు తాగించిన యువకులు.. వీడియో వైరల్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో కొంతమంది స్థానిక నివాసితులు తమ పెంపుడు కుక్కకు ఆల్కహాల్ ఇవ్వడం ఇందులో కనిపించింది. ఈ సమయంలో కుక్కపిల్లకి మద్యం ఇచ్చిన ఓ యువకుల గుంపు నవ్వుతూ, సంబరాలు చేసుకుంటుంది. అంతే కాదు కుక్కపిల్ల సంతోషంగా మద్యం సేవిస్తోందని కూడా వారు ప్రశంసించారు. ఈ సంఘటనను ఓ యువకుడు తన ఫోన్ లో రికార్డ్ చేయడం కూడా ఇందులో చూడవచ్చు.

ఎక్స్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోపై సవాయ్ మాధోపూర్ పోలీసులు స్పందిస్తూ, ఈ విషయంలో అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆల్కహాల్  కుక్క ఆరోగ్యానికి హానికరం అని ఆరోపించారు.