Viral Video: వీడు మాములోడు కాదు బయ్యా.....బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్ ...

Viral Video:   వీడు మాములోడు కాదు బయ్యా.....బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్ ...

బైక్ డ్రైవర్ ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేశాడో  ఈ వీడియో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓ కారు డ్రైవర్  ఈ వింత దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ అనేది అద్భుతమైన, ఫన్నీ వీడియోల స్టోర్‌హౌస్.. సోషల్ మీడియాలో రోజూ ఎన్నోరకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అందులో అనేక వీడియోలు మిమ్మల్ని వినోదభరితంగా ఉంచుతుంది. ఇలాంటి వీడియో మరోకటి సోషల్ మీడియాలో కనిపించింది. అందులో ఒక వ్యక్తి తన బైక్‌పై ఎద్దును తీసుకువెళుతున్న దృశ్యం! అది చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కై నోరెళ్ల బెడుతున్నారు.  ఈ వీడియోలో.. ఓ వ్యక్తి బైక్‌పై ఎద్దును  బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని ...  అతను బైక్‌ను ఫుల్ స్పీడ్‌తో నడుపుతూ వెళ్తున్నాడు. ఆ ఎద్దు కూడా బైక్‌పై చాలా హాయిగా కూర్చున్నట్లు కనిపిస్తుంది.  కానీ, ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా ఎద్దును తన బైక్ పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రస్తుతం వైరల్​ అవుతున్న ఈ వీడియోపై మనమూ ఓ లుక్కేద్దాం..

 ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ పై ఎద్దును ముందు కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతున్నాడు. అంత వేగంతో వెళ్తున్నా ఆ ఎద్దు.. ఎటూ కదలకుండా ముందు కూర్చుని అటూ ఇటూ చూస్తోంది. మామూలుగా ఎద్దు.. ఏదైనా పెద్ద వాహనంలో ఎక్కిస్తేనే.. అటు ఇటు కదలకుండా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా, ఎటువంటి భయం లేకుండా దర్జాగా కూర్చుంది.
నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వీడియోను ఓ కారు డ్రైవర్ తన మొబైల్లో రికార్డ్ చేశారు.

ఈ వీడియోను ట్విట్టర్‌లో @nareshbahrain అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 93 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. దీన్నే బుల్ రన్ అంటారని చెప్పాడు. మరొకరేమో.. ప్రపంచం చాలా భిన్నమైనది.. ఎవరూ ఊహించని నైపుణ్యాలతో నిండి ఉంది అని కామెంట్ చేశాడు.  కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది నైజీరియాలో జరిగి ఉంటుందని.. అక్కడి ప్రజలే ఇలాంటి వింత పనులు చేస్తారని అంటున్నారు. మరికొంతమంది.. 'నువ్వు గ్రేట్ రా బుజ్జి', 'వీడు మాములోడు కాదు బయ్యా' అంటూ ఇంకొకరు  కామెంట్స్ చేస్తున్నారు.  బైక్​లపై భారీ స్థాయిలో వస్తువులను తీసుకెళ్లడం, ఎక్కువమంది మనుషులను ఎక్కించి డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లే వారిని చూసి ఉంటాం.. కానీ, ఎద్దును తీసుకెళ్లడం ఏంటండీ బాబు' అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.