ఈ అబ్బాయి పడే కష్టానికి మనసు కరుగుతుంది

ఈ అబ్బాయి పడే కష్టానికి మనసు కరుగుతుంది

కొందరిని చూస్తే వాళ్లు చేసే పని అటుంచితే... వాళ్లు పడే కష్టానికి మనసు కరుగుతుంది. అందుకు బెస్ట్‌‌ ఎగ్జాంపుల్‌‌ ఈ వీడియో. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంతో ముందుకు వెళ్లాలనే ధైర్యం రావాలంటే ఈ సమోసాలు అమ్మే అబ్బాయి వీడియో చూడాలి. సమోసాలు అమ్మడంలో స్పెషల్​ ఏముంది అనిపిస్తుందా? మామూలుగా హోటల్స్‌‌లో, రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టి, లేదంటే సైకిల్‌‌ మీద తిరుగుతూ అమ్ముతుంటారు కదా. ఇతను మాత్రం ఒక చేతిలో గ్యాస్‌‌ స్టవ్‌‌ పట్టుకుంటాడు. దానికే వెల్డింగ్‌‌ చేసిన  హ్యాండిల్‌‌ ఉంటుంది. ఆ స్టవ్‌‌ మీద కడాయి, ఇంకో చేతిలో బకెట్‌‌ పట్టుకుంటాడు. దాంట్లో వేగించడానికి రెడీ చేసిన  సమోసాలు ఉంటాయి.

ఈ సమోసాలు అమ్మే కుర్రాడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు. దాంతో పొట్టకూటి కోసం ఊర్లోని గల్లీలన్ని తిరుగుతూ సమోసాలు అమ్ముతున్నాడు. వాస్తవానికి ఇంట్లో అవసరాల కోసం తోపుడు బండిపై సమోసాలు అమ్మాలనుకున్నాడు. కానీ డబ్బు లేక తన దగ్గర ఉన్న చిన్న గ్యాస్‌‌ స్టవ్‌‌ను హ్యాండిల్‌‌తో చేతిలో పట్టుకునేలాగ చేయించి, దానిపైన ఒక కడాయి పెట్టాడు ఈ స్టూడెంట్​. అందులో వేడి నూనె ఎప్పుడూ కాగుతూనే ఉంటుంది. ఇంకో చేతిలో బకెట్‌‌ దాంట్లో ముందే ప్రిపేర్‌‌‌‌ చేసి పెట్టుకున్న సమోసాలు ఉంటాయి. గల్లీ గల్లీ తిరుగుతూ, కావాల్సిన వాళ్లకు అక్కడే వేడి వేడి  సమోసాలు వేసిస్తాడు. అదికూడా10 రూపాయలకు 4 చొప్పున. ఈ వీడియో వైరల్‌‌ కావడానికి గౌరవ్‌‌ వాసన్ అనే ఫుడ్ ట్రావెలర్‌‌‌‌ కారణం. ఈయన తన ఇన్‌‌స్టాగ్రాం అకౌంట్‌‌ ‘యూట్యూబ్‌‌ స్వాడ్‌‌ అఫీషియల్‌‌’ తో పాటు, తన యూట్యూబ్‌‌ ఛానల్‌‌ లోనూ ఈ వీడియో పోస్ట్‌‌ చేసాడు. లక్నోలోని పుస్తక్‌‌ బజార్‌‌‌‌లో సమోసాలు అమ్ముతున్న ఈ అబ్బాయి వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇన్‌‌స్టాగ్రాంలో ఆ వీడియోకు 5.6 మిలియన్‌‌ వ్యూస్‌‌, 509 వేల లైక్స్‌‌, యూట్యూబ్‌‌లో 3.7 మిలియన్‌‌ వ్యూస్‌‌ వచ్చాయి.