కొత్త ఇంట్లో కోబ్రా.. చెప్పులో నుంచి ప్రత్యక్షం

కొత్త ఇంట్లో కోబ్రా.. చెప్పులో నుంచి ప్రత్యక్షం

షూ వేసుకునే స‌మ‌యంలో చూసుకోవాలి. ఏదో పురుగు, పుట్రా అనుకునేరు.. పాములు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో వీడియోలు తిరిగాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో షూను కింగ్ కోబ్రా తన ఇంటిగా మార్చుకుంది.  అందులో  నాగు పాము బుస‌లు కొడుతూ ఉంది.

షూలో చిన్న నాగుపాము పిల్లను గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసేందుకు సిద్దపడ్డాడు.  దానిని వీడియో తీసేందుకు దగ్గరగా రావడంతో వెంటనే ఆ పాము కోరలు బయటపెట్టింది.  అయినా కొద్దిపాటి వీడియోను భయపడుతూ తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వర్షాకాలంలో పాములు తమ నివాస ప్రాంతాల నుంచి బయటకు వస్తాయి.   షూలు సహజంగా బయట విప్పుతాము.  వీటిలోకి ఇలాంటి హానికర జంతువులు వెళతాయి.  షైలును వేసుకొనేటప్పుడు పరిశీలించి వేసుకోవాలి.  ఇంతకు ముందు కూడా  ముంబైలోని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మహాత్మా గాంధీ స్విమ్మింగ్ పూల్‌లో రెండు అడుగుల పొడవున్న మొసలి పిల్ల  కనిపించింది.

ALSO READ : స్మార్ట్ఫోన్ బ్యాటరీ లైఫ్ సామర్థ్యం పెరగాలంటే..ఇలా చేయండి


సో.. షూ వేసుకునే స‌మ‌యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వేసుకునే ముందు చెక్ చేస్తే స‌రి.. లేదంటే అందులో కాలేస్తే అంతే సంగ‌తులు. కానీ అత‌డు తెలివిగా ప్రవ‌ర్తించాడు. అవును అందుకే కాబోలు.. ఆ పాము  వీడియో తెగ చ‌క్కర్లు కొడుతుంది. నెటిజ‌న్లు కూడా జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.