Virat Kohli Retirement: రిటైర్మెంట్ తర్వాత తొలిసారి మాట్లాడిన కోహ్లీ.. వీడియో వైరల్

Virat Kohli Retirement: రిటైర్మెంట్ తర్వాత తొలిసారి మాట్లాడిన కోహ్లీ.. వీడియో వైరల్

టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం బృందావన్ ధామ్‌ను సందర్శించారు. ఆధ్యాత్మిక ప్రవృత్తికి పేరుగాంచిన ఈ జంట.. వారి దీర్ఘకాల ఆధ్యాత్మిక మార్గదర్శి స్వామి ప్రేమానంద్ మహారాజ్ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, కోహ్లీని ఆధ్యాత్మిక గురువు "మీరు సంతోషంగా ఉన్నారా?" అని అడుగుతారు. దీనికి బదులుగా కోహ్లీ "జీ గురు జీ" అని సున్నితమైన చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. 

ALSO READ | Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. బీసీసీఐ తీసుకొచ్చిన ఆ రూల్ కారణంగానే గుడ్ బై..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా సంతృప్తికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖంలో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపిన తరువాత మానసికంగా కోహ్లీ దృడంగా ఉండాలనే తమ దీర్ఘకాల ఆధ్యాత్మిక గురువును కలిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోహ్లీ దృష్టి ఐపీఎల్ మీదే ఉంది. ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ 2025లో కోహ్లీ 505 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.