విరాట్ కోహ్లీ అభిమానిని అందుకే అలా కొట్టారు.. ఫ్యాన్ కాబట్టి సరిపోయింది..

విరాట్ కోహ్లీ అభిమానిని అందుకే అలా కొట్టారు.. ఫ్యాన్ కాబట్టి సరిపోయింది..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తు్న్న సమయంలో.. ఓ అభిమాని స్టేడియంలో పరిగెత్తుకుంటూ వచ్చి.. కోహ్లీ కాళ్లు పట్టుకున్నాడు.. ఫ్యాన్స్ అభిమానంగా వచ్చినందుకు కోహ్లీ హ్యాపీగానే ఫీలయినా.. స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నది.

స్టేడియంలోకి వచ్చిన కోహ్లీ అభిమానిని.. పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకెళ్లింది. స్టేడియంలోనే.. గ్రౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చి.. ఆ కుర్రోడు కుమ్మేశారు. సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. కాళ్లతో తన్నారు.. చేతులతో చెంపలు వాయించారు.. దెబ్బలకు తట్టుకోలేక కింద పడిన ఆ కుర్రోడి కడుపులో కాళ్లతో తన్నారు.. నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఆ కుర్రోడిని రెండు నిమిషాలపాటు బీభత్సంగా కొట్టారు. 

విరాట్ కోహ్లీ అంటే పిచ్చి.. క్రికెట్ అంటే ప్రాణం ఉన్న అభిమానులు ఇలానే చేస్తారు.. ఈ మాత్రం దానికి అంతలా కొట్టాలా అని ఎవరైనా అనుకోవచ్చు.. క్రికెట్ అభిమానులంగా ఇలా ఆలోచించటంలో తప్పులేదు కానీ.. సెక్యూరిటీ పరంగా మాత్రం ఇది చాలా పెద్ద నేరం. అంతర్జాతీయ మ్యాచ్.. ఇతర దేశాల క్రికెటర్లు అందరూ గ్రౌండ్ లో ఉన్నారు.. అలాంటి సమయంలో అభిమాని కాబట్టి సరిపోయింది.. అదే ఇంకెవరైనా దేశ ద్రోహి.. తీవ్రవాది అయ్యి ఉంటే పరిస్థితి ఏంటీ.. సెక్యూరిటీ వ్యవస్థ మొత్తం వైఫల్యం కాదా.. అసలు అభిమాని గ్రౌండ్ లోకి అలా పరిగెత్తుకుంటూ వచ్చాడంటే సెక్యూరిటీ వైఫల్యం కాదా.. అందుకే సెక్యూరిటీ సిబ్బంది చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

స్టేడియంలోనే ఆ కుర్రోడిని కుళ్లబెడిచిన తర్వాత.. భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారిస్తున్నారు. అతని బ్యాగ్రౌండ్ చెక్ చేస్తున్నారు.