Virat Kohli: సంతోషకరమైన క్షణం.. విషాదకరంగా మారింది: చిన్నస్వామి తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన కోహ్లీ

Virat Kohli: సంతోషకరమైన క్షణం.. విషాదకరంగా మారింది: చిన్నస్వామి తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన కోహ్లీ

2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్‎లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నాటక ప్రభుత్వం.. తొక్కిసలాటపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్‎ను ఏర్పాటు చేసింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాటపై విరాట్ కోహ్లీ తొలిసారి మాట్లాడాడని RCB ఫ్రాంచైజీ తెలిపింది. "జూన్ 4వ తేదీన జరిగిన హార్ట్ బ్రేకింగ్ తీవ్రంగా బాధిస్తోంది. మన ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత సంతోషకరమైన క్షణం.. విషాదకరంగా మారింది. గాయపడిన ఫ్యాన్స్, బాధితులను కోల్పోయిన ఫ్యామిలీస్ గురించి నేను ఆలోచిస్తున్నాను. వారి కోసం ప్రార్ధిస్తున్నాను. మీ నష్టం మా కథలో భాగం. మనమందరం కలిసి చాలా జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతగా ముందుకు వెళ్ళాలి. అని కోహ్లీ చెప్పినట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తెలిపింది.

ఈ విషాదకర వార్త తర్వాత బెంగళూరులో చిన్న స్వామీ క్రికెట్ సస్టేడియానికి చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇకపై అక్కడ మ్యాచ్ లు నిర్వహించకుండా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 32000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఇకపై క్రికెట్ ఆడే సూచనలు కనిపించడం లేదు. చిన్నస్వామి ఈ స్టేడియాన్ని మరపిస్తూ బెంగళూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు. భవిష్యత్తులో బెంగళూరు నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం సూర్య సిటీ, బొమ్మసంద్రలో ఉంటుంది.