Virat Kohli: ప్రపంచ రికార్డుకు 67 పరుగుల దూరంలో

Virat Kohli: ప్రపంచ రికార్డుకు 67 పరుగుల దూరంలో

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే పలు అంతర్జాతీయ రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అంతేకాకుండా సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల రికార్డ్ లను తిరగరాస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో సచిన రికార్డ్ ను బద్దలుకొట్టాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు (20) చేసిన సచిన్ ని, కోహ్లీ సమం చేశాడు. అయితే, తాజాగా మరొక మైలు రాయిని చేరుకునే దిశగా కోహ్లీ అడుగులు వేస్తున్నాడు.  శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్దనే రికార్డ్ ని చేరుకోవడానికి కేవలం అడుగుదూరంలో ఉన్నాడు. 

జయవర్దనే తన కెరీర్లో 448 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడిన జయవర్దనే 33.4 యావరేజ్ తో 12,650 పరుగులు చేశాడు. అయితే, ఈ రికార్డ్ ను కోహ్లీ తిరగరాయబోతున్నాడు. ఇప్పటివరకు 266 వన్డే మ్యాచ్ లు ఆడిన విరాట్, 57.7 సగటుతో 12,584 పరుగులు చేశాడు. అయితే, జయవర్దనే రికార్డ్ ని తిరగరాయడానికి కోహ్లీకి ఇంకా 67 పరుగులు మాత్రమే కావాలి. అయితే, సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు.