
బెంగళూరులో ఎక్కడ చూసిన కోహ్లీ మేనియానే. ఏ షాప్ లో చూసినా కోహ్లీ టెస్ట్ జెర్సీనే. శనివారం (మే 17) కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్ లో కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వేడుకలు ఆర్సీబీ ఫ్యాన్స్ గ్రాండ్ గా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోహ్లీకి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఓ రేంజ్ లో సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
రాత్రి 7:30 నిమిషాలకు జరగబోయే ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఫ్యాన్స్.. వైట్ జెర్సీలను ధరించి గ్రాండ్ గా నివాళులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వైట్ జెర్సీ వెనక కోహ్లీ టెస్టుల్లో ధరించే నెంబర్ 18 ఉండబోతుంది. ఇప్పటికే అభిమానులు భారీ సంఖ్యలో 18 నెంబర్ వైట్ జెర్సీలను కొన్నట్టు సమాచారం. స్టేడియం బయట, బెంగళూరులోని కొన్ని షాపుల్లో కోహ్లీ టెస్టుల్లో ధరించే నెంబర్ 18 జెర్సీకి డిమాండ్ బాగా పెరిగింది. హాట్ కేకుల్లా జెర్సీలు అమ్ముడుపోతున్నాయి. కోహ్లీ టెస్టుల్లో ధరించే 18 నెంబర్ వైట్ జెర్సీ ఫ్యాన్స్ కొనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Virat Kohli's Test jersey outside the Chinnaswamy. ❤️#ViratKohli𓃵 #Bengaluru #Chinnaswamy #thomaskong #ViratKohli𓃵 #Thala pic.twitter.com/imX6FUFCSa
— RCBIANS (@sai1293106) May 17, 2025
ఐపీఎల్ 2025లో కోహ్లీ 505 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది.