సెహ్వాగ్‌ వీరబాదుడు.. 20 బాల్స్‌లో హాఫ్ సెంచరీ

సెహ్వాగ్‌ వీరబాదుడు.. 20 బాల్స్‌లో హాఫ్ సెంచరీ
  • బంగ్లాదేశ్‌‌ లెజెండ్స్‌‌తో మ్యాచ్‌లో రెచ్చిపోయిన వీరూ

రాయ్‌‌పూర్‌‌: కాంపిటీటివ్‌‌ క్రికెట్‌‌కు దూరమై చాలా కాలమైనా.. టీమిండియా మాజీ డాషింగ్‌‌ ఓపెనర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ బ్యాట్‌‌ స్పీడ్‌‌లో ఎలాంటి తేడా రాలేదు. రోడ్‌‌ సేఫ్టీ వరల్డ్​ సిరీస్‌‌లో భాగంగా బంగ్లాదేశ్‌‌ లెజెండ్స్‌‌తో  శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో సెహ్వాగ్‌‌ (35 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 నాటౌట్‌‌) బాల్‌‌ను ఉతికారేశాడు. 20 బాల్స్​లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. దాంతో,  ఇండియా లెజెండ్స్‌‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  తొలుత బంగ్లా 19.4 ఓవర్లలో 109కి ఆలౌటైంది. నజీముద్దీన్‌‌ (49) టాప్‌‌ స్కోరర్‌‌.  యువరాజ్‌‌, ఓఝా, వినయ్‌‌ కుమార్‌‌ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో సెహ్వాగ్‌‌కు తోడు సచిన్‌‌ (33 నాటౌట్‌‌) కూడా మెరవడంతో ఇండియా లెజెండ్స్‌‌10.1 ఓవర్లలో 114 రన్స్‌‌ చేసి మ్యాచ్‌‌ గెలిచింది. సెహ్వాగ్‌‌కే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.