
తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇక్కడ విన్నా ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే చర్చ. విశాల్, లక్ష్మీ మీనన్(Laxmi menon) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఈ వార్తల సారాంశం. దీంతో విశాల్ ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ విషయం గురించి తెలుసుకుపోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే గత వారంరోజులుగా ఈ వార్తలు బాగా వైరల్ అవుతుండటంతో హీరో విశాల్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
— Vishal (@VishalKOfficial) August 11, 2023
The reason behind my response is only…
‘‘సాధారణంగా నేను ఫేక్ న్యూస్ అండ్ రూమర్స్ పై స్పందించను. అనవసరమని వదిలేస్తాను. కానీ.. ఈసారి కచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. లక్ష్మీ మీనన్ తో నా పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాను. లక్ష్మీ మీనన్ హీరోయిన్ కంటే ముందు ఒక అమ్మాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా రూమర్స్ వస్తున్నాయి. అందుకే నేను స్పష్టత ఇస్తున్నాను. ఇక నా పెళ్లి ఎప్పుడు అనేది అనవసరమైన చర్చ. ఇకనైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు. విశాల్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆయన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మార్క్ ఆంటోనీ(Mark antony) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అధిక రవిచంద్రన్(Adhik ravichandran) తెరకెక్కిస్తున్న ఈ టైం ట్రావెల్ సినిమాలో మరో దర్శకుడు ఎస్జే సూర్య(SJ Surya) కీ రోల్ లో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.