గాంధీభవన్పై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల దాడి

గాంధీభవన్పై  విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల  దాడి

కాంగ్రెస్ లో అసంతృప్తుల ఆందోళన కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. పార్టీని నమ్ముకున్నవారిని కాదని..ప్యారాచూట్ నేతలకు టికెట్ల ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

జూబ్లీహిల్స్ టికెట్ ను ఈ సారి అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్. దీంతో  గాంధీభవన్ దగ్గర ఆందోళన చేశారు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు. కాంగ్రెస్ కండువాలు తగులబెట్టడంతో పాటు.. గాంధీభవన్ పై ఇటుకలతో దాడికి దిగారు. రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న ప్లాస్టిక్ బోర్టును కూడా ధ్వంసం చేశారు. మరోవైపు ఓల్డ్ సిటీలో నాన్ ముస్లిం కాండిడేట్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ అబ్ధుల్లా సోహైల్ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ సెకండ్ లిస్టులో టికెట్ దక్కని చాలా మంది నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు.  ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో సుభాష్ రెడ్డి..కూకట్ పల్లి టికెట్ దక్కకపోవడంతో గొట్టిముక్కల వెంగళ్ రావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి మరో రెండు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

ALSO READ : పరిగిలో ధర్నా చేసింది కర్నాటక రైతులు కదా...? వాళ్లు కూలీలా...?