ఫ్యామిలీ షోకి మాస్ హోస్ట్.. అదరగొట్టిన విశ్వక్ సేన్

ఫ్యామిలీ షోకి మాస్ హోస్ట్.. అదరగొట్టిన విశ్వక్ సేన్

కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha) మరో కొత్త కాన్సెప్ట్ తో, కొత్త హోస్ట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే అన్ స్టాప‌బుల్ విత్ NBK(Unstopable with NBK) టాక్ షోతో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను హోస్ట్ గా మార్చి సూపర్ సక్సెస్ సాధించిన ఆహా.. ఇప్పుడు తన కొత్త షో కోసం మాస్ కా దాస్ విశ్వక్ సీన్(Viswak sen) ను హోస్ట్ గా మార్చేసింది. 

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేని సంధర్బంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. షోకి కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ''అందరికీ నమస్తే.. వెల్ కమ్ టూ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ షో ఫ్యామిలీ ధమాకా(Family dhamaka).. ఇది దాస్ ఇలాకా'' అంటూ విశ్వక్ సేన్ తన స్టైల్లో చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. హోస్టింగ్ మొదటిసారైనా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు విశ్వక్.

గ్లోబల్ లెవల్లో సూపర్‌ హిట్ అయినా ఫ్యామిలీ గేమ్ షో ఆధారంగా ఈ షోని డిజైన్ చేశారు నిర్వాహకులు కానీ.. ఈ షో కాన్సెప్ట్ ఏంటి? ఎపిసోడ్స్ ఎన్ని ఉంటాయి? స్ట్రీమింగ్ ఎప్పటినుండి అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ప్రోమో చూస్తుంటే ఈ షో కూడా అన్ స్టాప‌బుల్ విత్ NBK షోలాగే సూపర్ హిట్ కానుంది అదే విషయం క్లియర్ గా అర్థమవుతోంది.