
ఓయూ, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ఆల్మాల స్టూడెండ్స్అసోసియేషన్నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం ఓయూ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో ఆదివారం (june 08) వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాల జాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మదునూరి రాహుల్, ఎనపోతుల అరుణ్ కుమార్, డి.రేనయ్య, కృష్ణ, ధనుంజయరాజు, రవి, ప్రేమ్, నరేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వివేక్ వెంకటస్వామిని తెలంగాణ మాల వారియర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగా శ్రీనివాస్ కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. అందర్నీ సమానంగా చూసి న్యాయం చేసే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే వివేక్‌వెంకటస్వామికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ స్పోక్స్ పర్సన్ చెల్లిమల్ల సునీల్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. వివేక్ ఎంట్రీతో క్యాబినెట్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. వివేక్ వెంకటస్వామి మంత్రిగా కొనసాగడం దళితుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.