
షాద్ నగర్,వెలుగు: అణగారినవర్గాలకు అంబేద్కర్ దేవుడని, మనమంతా ఉన్నత చదువు, క్రమశిక్షణతో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ లో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.
Also Rard: గ్యారంటీలు దేవుడెరుగు.. ఓట్లు పడతాయన్న గ్యారంటీనే లేదు: హరీశ్ రావు
అంబేద్కర్ 23 డిగ్రీలు తీసుకున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని చదువులో ముందుండాలని, చేతనైనంత సాయం చేస్తూ జాతి ఉన్నతికి తోడ్పడాలని ఆయన సూచించారు .