కె. విశ్వనాథ్ మృతిపై వివేక్ వెంకటస్వామి సంతాపం

కె. విశ్వనాథ్ మృతిపై వివేక్ వెంకటస్వామి సంతాపం

కె. విశ్వనాథ్ మృతిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వాగ్గేయకార దర్శకులు, కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణం తెలుగువారికి తీరని లోటు అని అన్నారు. ‘కె. విశ్వనాథ్ ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుడుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ వివేక్ వెంకటస్వామి ట్వీట్ చేశారు.