బంగారు తెలంగాణలో బాగుపడని బడులు..అటకెక్కిన కేజీ టు పీజీ విద్య హామీ

బంగారు తెలంగాణలో బాగుపడని బడులు..అటకెక్కిన కేజీ టు పీజీ విద్య హామీ

హైదరాబాద్, వెలుగు: బంగారు తెలంగాణలో సర్కార్ బడులు బాగుపడలేదని, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అటకెక్కిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ట్విట్టర్​లో విమర్శించారు. ‘‘పిల్లలకు పుస్తకాలు లేవు, యూనిఫామ్​లు లేవు, టీచర్ల నియామకాలు లేవు, బడులకు రిపేర్లు లేవు, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు లేవు, పురుగుల బువ్వతో పిల్లలు రోగా లపాలు’’ అని వివేక్​ ట్వీట్ చేశారు. రేషనలైజేషన్​పేరుతో 12 వేల బడులు మూసివేశారని, పేదోడిని పీక్కుతినే కార్పొరేట్ దోపిడీకి కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ’’ అనే హ్యాష్ ట్యాగ్​ను ట్వీట్​కు యాడ్ చేశారు.

ఏం సాధించారని పట్టణ ప్రగతి ఉత్సవాలు

దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వంపై వివేక్ ఫైర్ అయ్యారు. “హైదారాబాద్ విశ్వనగం అయిపోయిందా, కరీంనగర్ లండ న్​లా అభివృద్ధి చెందిందా, వరంగల్ డల్లాస్​లా మారి పోయిందా.. కెనడాను మించిన హాస్పిటల్స్ వచ్చినయా.. మరి ఎందుకోసం ఈ పట్టణ ప్రగతి దినోత్సవా లు.. వందల కోట్ల ప్రజా ధనంతో ఎవరికోసం ఈ దశాబ్ది ఉత్సవాలు” అని ప్రశ్నించారు.

విశాఖలో వివేక్ పర్యటన

పేదల సంక్షేమం, సుపరిపాలన, సేవే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని వివేక్ ​వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన జిల్లాస్థాయి సోషల్ ​మీడియా ఇన్​ఫ్లూయెన్సర్స్ మీట్​కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ తొమ్మిదేండ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల్ని రానున్న 2024 జనరల్ ఎలక్షన్​లో సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేయడంపై దిశా నిర్దేశం చేశారు. కార్య క్రమంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, జిల్లా ఇన్​చార్జ్ పుట్ట గంగయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేశ్, ఉత్తరాంధ్ర బీజేపీ సోషల్ మీడియా జోనల్ ఇన్​చార్జ్ వేమూరి మహేశ్, దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.