ఫ్రీ న్యూ ఇయర్ పార్టీ.. మందేస్తూ హీరోయిన్ తో చిందేసిన వర్మ

ఫ్రీ న్యూ ఇయర్ పార్టీ.. మందేస్తూ హీరోయిన్ తో చిందేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ అన్నంత పనిచేశాడు. బ్యూటీఫుల్  మూవీ టీంతో ఫ్రీ న్యూఇయర్ పార్టీ చేసుకున్నాడు. నిన్న (ఆదివారం) మూవీ టీం మొత్తం సరదాగా ఎంజాయ్ చేసింది. రామ్ గోపాల్ వర్మ, బ్యూటీఫుల్ మూవీ హీరోయిన్ నైనా గంగూలీ, పార్థ సూరితో, డైరెక్టర్  అగస్త్య మంజు ఈ పార్టీలో ఎంజాయ్ చేశారు. వోడ్కా తాగుతూ చిందేశారు. హీరోయిన్ నైనా గంగూలీతో ఆర్జీవీ , డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటులు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.