మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు

మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు

కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికలకు టైం దగ్గరపడుతుంది. ఓటర్ల లిస్టును ఫైనల్ చేస్తున్న అధికారులు తప్పుల తడకగా తయారు చేస్తున్నారు. మొన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు కల్పించారు అధికారులు.

నందిత మెతుకు అనే మూడేళ్ల చిన్నారికి ఓటరు లిస్టులో 35 ఏళ్లుగా నమోదు చేశారు. చిన్నారి ఫొటో.. పేరు క్లీయర్ గా కనిపించడంతో ఈ ఓటర్ ఐడీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఓటరు జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై జనం మండిపడుతున్నారు.