గోషామహల్​లో ఓటర్ నమోదు షురూ

గోషామహల్​లో ఓటర్ నమోదు షురూ

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు:  రాబోయే ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలనే లక్ష్యంతో బల్దియా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా సోమవారం గోషా మహల్ సెగ్మెంట్​లోని జాంబాగ్ డివిజన్​లో బూత్ నం.31 నుంచి 40 వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటర్ జాబితాలో నమోదైన పేరులో కరెక్షన్స్, మిస్ మ్యాచ్ ఫోటోలు, ఇంటి నంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ నమోదులో తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఓటరుగా నమోదు చేసుకోండి: రోనాల్డ్ రోస్

అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు వచ్చిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950కు కాల్ చేయాలని ఆయన సూచించారు.